యువత చొరవతో గోదావరి స్నానఘట్టం పరిశుభ్రం
ఆదివారం ఉదయం 40 మందికి పైగా యువకులు, మహిళలు ఘాట్ వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తను తొలగించారు.

కార్తీక స్నానాలు దగ్గర పడుతున్న వేళ గాడిలంక యువజన సంఘం ఆధ్వర్యంలో గోదావరి స్నానఘట్టం వద్ద పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. ఉదయం ఆరు గంటల నుండే యువకులు, మహిళా సంఘాల సభ్యులు మెట్లపై, ఒడ్డున పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, పూజా వ్యర్థాలను సేకరించారు.
సేకరించిన చెత్తను పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తరలించారు. ఘాట్ వద్ద రెండు చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. "నది మనకు తల్లి లాంటిది — దయచేసి ప్లాస్టిక్ వేయకండి" అని నిర్వాహకులు గ్రామస్తులను కోరారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు.
వ్యాఖ్యలు 2
Lakshmi
Great effort by our youth! Please keep it up.
శ్రీను
చాలా మంచి పని చేశారు. వచ్చే నెల నేను కూడా వస్తాను 👍