కార్తీక మాసం: గ్రామ ఆలయంలో ప్రత్యేక పూజలు, గోదావరి తీరాన దీపోత్సవం
కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పౌర్ణమి రోజు గోదావరిలో దీపాలు వదిలే కార్యక్రమం.

కార్తీక మాసం సందర్భంగా గాడిలంక గ్రామ ఆలయంలో ప్రతి సోమవారం ఉదయం ప్రత్యేక అభిషేకాలు, సాయంత్రం దీపారాధన జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది.
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం గోదావరి స్నానఘట్టం వద్ద సామూహిక దీపోత్సవం నిర్వహిస్తారు. భక్తులు అరటి దొప్పల్లో దీపాలు వదలవచ్చు. ప్లాస్టిక్ వాడకుండా సహకరించాలని కమిటీ కోరింది. పూజా సమయాల వివరాలు ఈ యాప్‌లో తెలియజేస్తాం.
వ్యాఖ్యలు 1
సత్యవతి
దీపోత్సవం సమయం తెలియజేయండి.